వెల్లింగ్టన్ వేదికగా జరిగిన భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ మరోసారి ఉత్కంఠగా మారింది. నాల్గొవ టీ20 మ్యాచ్ టై గా ముగిసింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. ఇరుజట్ల మధ్య వరుసగా రెండోసారి మ్యాచ్ టై అయింది.