రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది.మొత్తం 16,925 మంది కానిస్టేబుళ్లలో తొలుత సివిల్ అభ్యర్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారం భం కానున్నదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిక్షణ కార్యక్రమాన్ని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్‌గ్రౌండ్‌లో హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ప్రారంభించనున్నారు.
జోన్ 6 పరిధిలో ఏఆర్ ఆర్‌ఎస్సై-2018 రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు అంబర్‌పేట పోలీస్‌లైన్స్ పరేడ్‌గ్రౌండ్‌లో రిపోర్టుచేయాలని హైదరాబాద్ రేంజి ఇంచార్జి డీఐజీ శివశంకర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అభ్యర్థులు ఐడెంటిటీ బాండ్, తొమ్మిది పాస్‌పోర్టు సైజు ఫొటోలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లుతోపాటు ‘క్యాడెట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మెస్, ఆర్‌బీవీఆర్‌ఆర్ టీఎస్‌పీఏ’ పేరిట రూ.15వేల డీడీ తీసుకొని రిపోర్టుచేయాలని సూచించారు.